పిచ్చాస్పత్రికి.. కొత్త సిఎం: శంకరరావు వర్సెస్ పద్మావతి

పార్టీ నేతలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న శంకరరావును వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయనను పార్టీ నుండి తొలగించకపోతే పిచ్చాస్పత్రిలో చేర్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణ వ్యతిరేకిగా చిత్రీకరించడం సరికాదని ఆమె అన్నారు. ఆయనకు పిచ్చి పట్టినట్లుగా ఉందన్నారు.
పుల్లా పద్మావతి వ్యాఖ్యలపై ఆ తర్వాత శంకరరావు మండిపడ్డారు. ఆమె చరిత్ర హీనురాలు అన్నారు. ఆమె తనను విమర్శించడం వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని ఆరోపించారు. త్వరలో కొత్త ముఖ్యమంత్రి, కొత్త మంత్రివర్గం వస్తుందన్నారు. తమ పార్టీ అధిష్టానం ఎప్పుడైనా కిరణ్ కుమార్ రెడ్డిని తొలగిస్తుందన్నారు.
పుల్లా పద్మావతి ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదన్నారు. ఆమెకు ఓ పద్ధతి అంటూ లేదన్నారు. తాను ఓసారి దేవుడిని పద్మావతి గురించి అడిగేతే తనకే తెలియదని చెప్పారని శంకరరావు ఎద్దేవా చేశారు. ఆమె ఎక్కడుంటారో దేవుడికి కూడా తెలియదన్నారు.












Click it and Unblock the Notifications