సారీ చెప్పి యాత్ర, చెప్పే ధైర్యముందా: షర్మిలకు వర్ల

అసెంబ్లీలో దీనిపై పెద్ద గొడవ జరిగినా ఒక్క ఎకరం కూడా దళితులకు తిరిగి ఇవ్వలేదన్నారు. వారి భూముల సరసన దళితులు ఉండటాన్ని సహించలేకపోవడమే దీనికి కారణమని విమర్శించారు. ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలు పెట్టే ముందు అక్కడ తమ ఆధీనంలో ఉన్న భూములను దళితులకు పంచి వారిని క్షమాపణ కోరాలని ఆయన డిమాండ్ చేశారు.
షర్మిల తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి ఖమ్మం జిల్లాలో 1.40 లక్షల ఎకరాల ఇనుప ఖనిజం భూములను తన తండ్రి అధికారంలో ఉండగా.. రక్షణ స్టీల్స్‌కు రాయించుకొన్నారని చెప్పారు. ఈ విధంగా రాయించుకోవడం తప్పేనని ప్రజల ముందు ఆమె అంగీకరించాలని ఆయన కోరారు.
జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రజలను కోరే నైతిక ధైర్యం ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు లేదా షర్మిలకు ఉందా అని ప్రశ్నించారు. వైయస్ జగన్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన చీడ పురుగులని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications