కెసిఆర్ ఎప్పుడైనా చెప్పారా, మీడియా కీలకం: వినోద్

షిండే వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. తాను షిండేను కలిసినట్లు కెసిఆర్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. షిండే వ్యాఖ్యలను తీసుకొని కెసిఆర్ చెప్పింది అబద్దం అన్నట్లుగా సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసలు కాంగ్రెసు పార్టీ పెద్దలతో చర్చలు జరగలేదన్నట్లుగా మీడియా ప్రచారం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ గురించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన మీడియాకు సూచించారు.
ప్రజాస్వామ్యంలో మీడియాది ప్రత్యేక బాధ్యత అన్నారు. ఉద్యమ స్వరూపాన్ని ప్రజలకు చేర్చడంలో మీడియాదే గొప్ప పాత్ర అన్నారు. కెసిఆర్ ఢిల్లీ నేతలతో చర్చలు జరపలేదని చెప్పడం దుర్మార్గమైన ప్రచారమన్నారు. రాజకీయ పార్టీలు తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకుంటేనే కేంద్రంలో కదలిక ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణపై తమ అభిప్రాయాన్ని చెప్పాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications