బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు బెయిల్

కాగా తెహెల్కా కుంభకోణం స్టింగ్ ఆపరేషన్ కేసులో బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌కు ఢిల్లీ కోర్టు ఏప్రిల్‌లో నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన విషయం తెలిసిందే. లక్ష్మణ్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని సిబిఐ కోరింది. అయితే, తన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని శిక్షను తగ్గించాలని బంగారు లక్ష్మణ్ కోర్టును కోరారు. దీంతో 72 ఏళ్ల బంగారు లక్ష్మణ్‌కు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడమే కాకుండా లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.
లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ తెహెల్కా స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిన బంగారు లక్ష్మణ్‌ను కోర్టు శుక్రవారం దోషిగా నిర్దారించింది. ఆయనకు అప్పుడు కోర్టు శిక్షను ఖరారు చేసింది. బంగారు లక్ష్మణ్ 2001లో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ లక్ష్మణ్ పట్టుబడ్డారు. అప్పటి నుంచి 11 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ జరిగింది. బంగారు లక్ష్మణ్‌కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కస్టడీలోకి తీసుకుని తీహార్ జైలుకు తరలించారు.
లక్ష్మణ్‌ను శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. శుక్రవారం కోర్టు తీర్పు తర్వాత బంగారు లక్ష్మణ్ కోర్టు హాల్లో కంటతడి పెట్టారు. స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడినప్పుడు బంగారు లక్ష్మణ్ బిజెపి జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ కుంభకోణంతో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బంగారు లక్ష్మణ్ అంచెలంచెలుగా పార్టీ జాతీయాధ్యక్షుడి దాకా ఎదిగారు. అయితే, తెహెల్కా చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌తో ఆయన జాతకం తిరగబడింది.












Click it and Unblock the Notifications