ఎంపీలపై డికె అరుణ ఎదురుదాడి: ఆజాత్‌పై నేతల గుర్రు

DK Aruna
న్యూఢిల్లీ/హైదరాబాద్: మంత్రి డికె అరుణ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులపై ఎదురుదాడికి దిగారు. మంత్రులు రాజీనామా చేయాలన్న ఎంపీలకు ఆమె శనివారం కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేంద్రంలో ఉండే తెలంగాణ ప్రాంత ఎంపీలు రాజీనామా చేస్తేనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని ఆమె అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. రాజీనామాలకు తాను వ్యతిరేకమన్నారు.

ఆజాద్ వ్యాఖ్యలపై మండిపాటు

కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో చేసిన ప్రకటనను అమలు చేయకపోతే పార్లమెంటు గౌరవం తగ్గించి, అవమానించినట్లేనని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. 2009లో చిదంబరం తెలంగాణపై ప్రకటన చేశారని గుర్తు చేశారు. దీనిని ఎవరో అడ్డుకున్నారని ఆగితే సరికాదని హితబోధ చేశారు. ఆజాద్ ప్రకటనలో కొత్తదనం ఏమీ లేదన్నారు.

త్వరలో కాంగ్రెసు తెలంగాణవైపు ఉందో లేదో తేల్చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అక్టోబరులో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోందని, ఆ తర్వాత తెలంగాణపై తేల్చుతారా లేదా చూస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండుపై కాంగ్రెసు ఆజాద్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉన్న అభ్యంతరాలేమిటో చెప్తే తాము సమాధానం చెప్తామని ఆయన అన్నారు.

సంప్రదింపుల్లో తలెత్తుతున్న సమస్యలేమిటో తమకు చెప్తే సమాధానాలు చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై సంప్రదింపుల తర్వాత శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదని విమర్శించారు. తెలంగాణ రాకపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని దుయ్యబట్టారు. తెలంగాణపై సంప్రదింపులు జరపాల్సిన అవసరం లేదని, సత్వరమే నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.

ఆజాద్, షిండే వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏం సమాధానం చెబుతారని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+