దోచుకున్న జగన్‌కోసం షర్మిల యాత్ర: ఈటెల, బాబుపై

దోపిడీ సొమ్మును కాపాడుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రపంచంలోనే జగన్ వలె దోచుకున్న వ్యక్తి మరొకరు లేరని నిప్పులు చెరిగారు. అధికారం కోసమే జగన్ పార్టీ పాదయాత్రకు సిద్దమయ్యారన్నారు. చంద్రబాబు కూడా తన తొమ్మిదేళ్ల పాలనలో ఎప్పుడూ ప్రజా సంక్షేమంపై దృష్టి సారించలేదన్నారు. ఇన్నాళ్లూ పట్టించుకోకుండా ఇప్పుడు జనాల్లోకి వస్తే ప్రజలు బాబును, షర్మిలను నమ్మరన్నారు. బాబుది దొంగ యాత్ర అన్నారు.
ఎన్ని యాత్రలు చేసినా చంద్రబాబును ప్రజలు ఆశీర్వదించరన్నారు. వారిద్దరి యాత్ర అధికారంలోకి వచ్చేందుకే తప్ప ప్రజల కోసం కాదన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితిని ఏర్పాటు చేసింది తామేనని, తమకు ఐకాసతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం లేదని కాంగ్రెసు చెప్పడం సరికాదన్నారు. ఏకాభిప్రాయం అంటూ జపం చేస్తే కుదిరే పని కాదని, ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెసు లేకుండా పోయిందన్నారు. ఇకనైనా వారు కళ్లు తెరిచి తెలంగాణ ప్రకటిస్తే మంచిదన్నారు.












Click it and Unblock the Notifications