వేలకోట్లు దోచి డ్రామాలా: జగన్‌పై బాబు, షర్మిల టూర్‌పై

Chandrababu Naidu
అనంతపురం: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రూ.43వేల కోట్లు దోచుకున్నట్లు సిబిఐ తేల్చిందని, అన్ని వేల కోట్లు దోచి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల పైన నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లాలో పన్నెండో రోజు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తల్లి కాంగ్రెసుపై అవిశ్వాసం పెట్టాలంటూ పిల్ల కాంగ్రెసు ఇప్పుడు మమ్మల్ని అడుగుతోందని, అవిశ్వాసం డిమాండును అడ్డు పెట్టుకొని ఢిల్లీలో వాళ్ల పనులు చేసుకోవడానికే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారని, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు రెండూ ఒక్కటే అన్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా టిడిపి ఆవిర్భవిస్తే... అవినీతి కాంగ్రెసు నుండి జగన్ పార్టీ వచ్చిందన్నారు. సంక్షేమం ముసుగులో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. అవినీతికి పాల్పడ్డ వారు ఇప్పుడు జైల్లో కూర్చున్నారని, మరికొందరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ ముఖర్జీకి తాము ఓటు వేయలేదని, జగన్ పార్టీ మాత్రం వేసి కాంగ్రెసుతో జతకట్టిందన్నారు. ఇప్పుడు కేసుల నుంచి తప్పించుకోవడానికే ఢిల్లీ చుట్టూ తిరుగుతూ అవిశ్వాసాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. మొన్నటి వరకు కాంగ్రెసులో ఉన్నప్పుడు అందరూ దోచుకొని ఇప్పుడు మాత్రం విడిపోయి డ్రామాలు ఆడుతున్నారన్నారు. వైయస్ ఏనాడూ తమ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టలేదని, ప్రజా సమస్యల కోసం తాము వైయస్ పైన, ప్రస్తుతం కిరణ్ పైన అవిశ్వసం పెట్టామన్నారు.

ఉనికి కోసమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ ఘనకార్యాలు సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తమ హయాంలో ఐటికి పెద్ద పీట వేశామని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పయనింప చేశామన్నారు. అవినీతి, అసమర్థ పాలకులు పాలించడం వల్లే రాష్ట్రం నేడు ఇలా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+