వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలు కష్టాల్లో ఉండగా బాబుకు పూలదండలొద్దు: సిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

CM Ramesh suggests to TDP activists
అనంతపురం: రాష్ట్రంలో ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, అందుకే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరిట పాదయాత్ర చేపట్టారని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న కారణంగా అధినేతకు పూలదండలు వేయవద్దని, టపాసులు పేల్చవద్దని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత సిఎం రమేష్ శనివారం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు బాబు సాహస యాత్ర చేస్తున్నారన్నారు.

ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రాష్ట్రంలో కటి దారిద్ర్యం రాజ్యమేలుతోందని మరో నేత కెఈ కృష్ణమూర్తి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో యూపిఏ అభ్యర్థికి ఓటు వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలని సవాల్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అవిశ్వాసం పేరుతో ఆ పార్టీ నాటకమాడుతోందని మండిపడ్డారు.

వైయస్సార్ కాంగ్రెసు ఎప్పుటైనా కాంగ్రెసులో కలిసిపోవడం ఖాయమన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతిపై జగన్ పార్టీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 2020 వరకు జగన్ బయటకు వచ్చే పరిస్థితి లేదని వారు జోస్యం చెప్పారు. కాగా అనంతపురం జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర నేటితో పూర్తవుతుంది.

English summary
Rajysabha Member CM Ramesh suggested TDP activists and followers that don't use flowers in Chandrababu padayatra due to people are in crisis now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X