జిల్లాను విడిచి వెళ్లాలని చమన్‌కు పోలీసుల హెచ్చరిక

జిల్లాలో తిరిగేందుకు చమన్‌కు అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. వెంటనే అతను జిల్లాను విడిచి వెళ్లి పోవాలని లేదంటే అరెస్టు చేయాల్సి వస్తుందని చెప్పారు. చమన్ కొద్ది రోజులుగా జిల్లాలోనే ఉంటున్నారు. బాబు పాదయాత్రలో కనిపించారు. ఆదివారం ఉదయం బాబు పాదయాత్ర దిగ్విజయంగా పూర్తికావాలని కోరుతూ గుత్తికొండలో ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. ఇది తెలిసిన పోలీసులు అతనిని గుత్తి నుండి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పోలీసులు చమన్‌ను అరెస్టు చేస్తామని చెప్పడంతో జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అబ్దుల్ ఖాన్ మద్దతుతో బయటకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. చమన్ జిల్లాలో తిరిగేందుకు పోలీసులు అనుమతించలేదు. కాగా పరిటాల రవీంద్రకు ప్రధాన అనుచరుడైన చమన్ కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి కొన్ని నెలల క్రితం బయటకు వచ్చారు. అతను రాజకీయాల్లో మెరిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications