హేమశ్రీ కేసులో వీడిన చిక్కుముడి: కాపురంచేయట్లేదని

భూలావాదేవీలకు సంబంధించి బెంగళూరులోని బయ్యప్పనహళ్లి పోలీసు స్టేషన్‌తో పాటు నగరంలోని అనేక పోలీసు స్టేషన్లలో సురేంద్రపై 25కు పైగా కేసులు ఉన్నాయని సమాచారం. ఓ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్న హేమశ్రీ తండ్రి నాగరాజ్ ఫోర్జరీ కేసులో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్న సురేంద్ర... ఈ కుటుంబానికి దగ్గరయ్యాడు. హేమశ్రీ అందానికి ఆకర్షితుడై ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాల్సిందిగా నాగరాజుపై ఒత్తిడి తెచ్చాడు.
ఈ నేపథ్యంలో హేమశ్రీ ఏడాది క్రితం ఇష్టం లేకపోయినా సురేంద్రను వివాహం చేసుకుంది. వివాహమైనా ఇంతవరకు వీరిద్దరు కలిసి కాపురం చేయలేదని తెలుస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న భర్త పథకం ప్రకారం హేమశ్రీని అంతం చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా తన స్నేహితుడితో హేమశ్రీ తన భర్తపై ఫోన్‌లో చెప్పిన సంభాషణలు దుమారం రేపాయి.
తనకంటే ముందు నలుగురు యువతులను తన భర్త వివాహం చేసుకున్నాడని, అతనో లైంగిక ఉన్మాది అని ఆమె తన స్నేహితుడితో చెప్పినట్లుగా తెలుస్తోంది. భర్త తీరుపై హేమశ్రీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినా ఆ తర్వాత ఉపసంహరించుకుంది. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం పోలీసులు పలువురిని ప్రశ్నిస్తున్నారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications