చంద్రబాబు దూకుడు: బాలకృష్ణ జోరు కోసం వెయిటింగ్

Chandrababu Naidu-Balakrishna
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ జోరు కోసం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. రాజకీయాలపై సినిమాల ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. రెండేళ్లుగా బాలకృష్ణకు వరుస ప్లాపులు వస్తున్నాయి. ఇదే 2014 వరకు కొనసాగితే అప్పటి సాధారణ ఎన్నికలలో చాలా ప్రభావం పడే అవకాశముందని చెబుతున్నారు.

చంద్రబాబు నాయుడు వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు డూ ఆర్ డై అన్న విధంగా బాబు, టిడిపి తీరు తయారయింది. దీంతో ఎలాగైనా పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు చంద్రబాబు శాయశక్తులా కృషి చేస్తున్నారు. అందుకే 63 ఏళ్ల వయస్సులోనూ చంద్రబాబు మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి ఇప్పటి వరకు తలెత్తినా ఆయన తగ్గలేదు.

తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. బాబు 117 రోజుల పాదయాత్ర చేయడమంటే మామూలు విషయం కాదు. కానీ రెండు పర్యాయాలు అధికారానికి టిడిపి దూరంగా ఉండటంతో ఆ పార్టీలో చాలా నిస్తేజం గూడు కట్టుకుంది. దీంతో పార్టీలో కొత్త ఉత్సాహం తేవడంతో పాటు 2014లో పార్టీని గట్టెక్కించడానికి నవ యువకుడిలా నడక కొనసాగిస్తున్నారు. బాబు యాత్రతో పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. దీంతో టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ఆ పార్టీలో తొణికిసలాడుతోంది.

అయితే బాబు దూకుడుకు బాలకృష్ణ సినిమాల జోరు ఉంటే బాగుంటుందనేది పలువురు అభిప్రాయమట. 2010లో బాలకృష్ణకు సింహా ద్వారా సూపర్ డూపర్ హిట్ లభించింది. ఆ తర్వాత పరమవీరచక్ర, అధినాయకుడు, ఊ కొడతారా ఉలిక్కి పడతారా, శ్రీమన్నారాయణలు ప్లాపుగా లేదా యావరేజ్‌గా నిలిచాయి. శ్రీరామరాజ్యం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దానిని వేరుగా చూస్తారు. బాలకృష్ణ.. బాబు దూకుడులా 2014లోగా సినిమాల్లో తన జోరు కొనసాగిస్తే పార్టీకి చాలా ప్లస్ అవుతుందని పలువురు భావిస్తున్నారు. బావ స్ఫూర్తితో బావమరిది టాలీవుడ్‌లో మంచి కథలు ఎంచుకొని తన జోరు కొనసాగించాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+