స్కూల్ గర్ల్స్‌పై అత్యాచారయత్నం: నిందితుడి అరెస్టు

ఇది గమనించిన టీచర్లు వారిని ప్రశ్నించారు. ఓ అంకుల్ తమను రమ్మంటున్నాడని, రాకపోతే వాతలు పెడతాడని వెళ్తున్నామని వారు చెప్పారు. టీచర్లు అడగటంతో వారు వేణు ఘాతుకం గురించి చెప్పారు. ఈ నెల 12వ తేదిన విద్యార్థులు ఇంటికి వస్తున్న సమయంలో వేణు వారికి స్వీట్స్ ఇస్తానని చెప్పి వారిని ఇంట్లోకి పిలిచాడు. అప్పటి నుండి నాలుగు రోజులుగా అలాగే చేస్తున్నాడట. వారిని అసభ్యకరంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.
ఒకరిపై అత్యాచార యత్నం చేసి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇవన్నీ టీచర్లు, తల్లిదండ్రుల దృష్టికి వెళ్లాయి. వేణు బెదిరించడంతో తాము బయటకు చెప్పలేక పోయామని విద్యార్థులు వాపోయారు. టీచర్లు, తల్లిదండ్రులు కలిసి నిందితుడిని నిలదీశారు. అతను తప్పును అంగీకరించాడు. దీంతో వారు పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications