ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఇళ్లలో ఎసిబి సోదాలు

కాగా వెంకటరమణ మూర్తి రాజు(కన్నబాబు)పై ఎసిబి అధికారులు గతంలో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. సాధారణంగా అధికారులపైనే ఈ కేసును నమోదు చేసే ఎసిబి... ఇప్పుడు ప్రజా ప్రతినిధిపైనా నమోదు చేసింది. ఓ ఎమ్మెల్యేపై ఎసిబి ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేయడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారని చెబుతున్నారు.
ఎమ్మెల్యే కన్నబాబు, ఆయన కుటుంబ సభ్యులు (భార్య, కుమారులు, కుమార్తె) ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, వాటిపై విచారణ చేయాలంటూ యలమంచిలికి చెందిన ఆడారి ఆదిమూర్తి ఈనెల 11న విశాఖపట్నం ఎసిబి న్యాయస్థానంలో కేసు వేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి జివి కృష్ణయ్య అక్టోబర్ 11వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ఎసిబి డీఎస్పీని ఆదేశించారు.
ఆ ఫిర్యాదును పరిశీలించిన ఎసిబి అధికారులు సోమవారం కేసు నమోదు చేశారు. కాగా, తన దగ్గర పని చేస్తున్న ఇద్దరు ఎస్సీ మహిళల పేరిట బ్యాంకుల నుంచి బస్సుల కొనుగోలుకు రుణం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు కోటి రూపాయల విలువైన రాయితీని పొందారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం దానిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
దర్యాప్తులో ఆరోపణలన్నీ వాస్తవమని తేల్చి రూ.98 లక్షలను ఎమ్మెల్యే నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్ సూచించింది. అయితే, ప్రభుత్వం రికవరీ చేయకపోవడంపై యలమంచిలికి చెందిన కొయిలాడ వెంకటరావు ఇదే నెలలో హైకోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎమ్మెల్యేపై విచారణ నివేదికను సమర్పించాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications