నిరూపిస్తే రాసిస్తా: ఆస్తిపై ఎమ్మెల్యే కన్నబాబు సవాల్

తాను జిల్లా ప్రజలకు అందరికీ తెలుసునని, తాను అక్రమాలకు పాల్పడ్డానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎసిబి సోదాలను తాను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఎసిబి సోదాల ద్వారా తన నిజాయితీ బయట పడుతుందన్నారు. తన ఆస్తులపై ఎసిబి నిరభ్యంతరంగా దర్యాఫ్తు చేసుకోవచ్చునన్నారు. అలా చేస్తే తాను క్లీన్‌గా బయటకు వస్తానన్నారు. ఐదేళ్లుగా తనపై ఆరోపణలు వస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
కాగా ఎమ్మెల్యే రమణమూర్తి రాజు(కన్న బాబు) ఇళ్లు, అతిథి గృహాలలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి) బుధవారం సోదాలు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నం, యలమంచిలిలలో ఉన్న ఆయన ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని గతంలో ఎమ్మెల్యేపై ఎసిబి కేసు నమోదయింది. దీంతో ఈ రోజు సిబి అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఆయన స్వగ్రామంలో కూడా ఎసిబి సోదాలు చేసింది.












Click it and Unblock the Notifications