వారు జగన్ పార్టీలోకి: పాల్వాయి, లగడపాటిపై ఫైర్

జలయజ్ఝం ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులో 2000 కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌తో పాటు మరికొంత మంది శానససభ్యులు వైయస్ జగన్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, ఇటువంటి వారిని నిలువరించకపోతే కాంగ్రెసు పార్టీకి నష్టమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కోవర్టులున్నారని అన్నారు.
పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నిక్కర్ వేసుకున్న రాజకీయ నాయకుడని వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీని, ప్రభుత్వాన్ని మోసం చేసి లగడపాటి రాజగోపాల్ కోట్లాది రూపాయలు గడించారని ఆయన ఆరోపించారు. తెలంగాణ వస్తుందని తెలిసే లగడపాటి తన వ్యాపారాలను, ఆస్తులను ఢిల్లీకి తరలిస్తున్నారని పాల్వాయి అన్నారు. కాంగ్రెసు పార్టీ వైఖరి లగడపాటికి తెలియదని ఆయన అన్నారు లగడపాటికి రాజకీయానుభవం లేదని, లగడపాటి మాటలకు విశ్వసనీయత లేదని అన్నారు.
తెలంగాణపై కేంద్రం నుంచి త్వరలోనే ప్రకటన వెలువడుతుందని, ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని పాల్వాయి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో పార్టీపరంగా చర్చలు జరిగాయని, ప్రభుత్వపరంగా చర్చలు జరగాల్సి ఉందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటన వెలువడే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణపై 2009 డిసెంబర్ 7వ తేదీననే ఏకాభిప్రాయం వచ్చిందని అన్నారు.












Click it and Unblock the Notifications