షర్మిల సోదరే కానీ: లగడపాటి, టి-మీడియాకు మద్దతు

షర్మిల తన చెల్లెలు అని అయితే రాజకీయ ఎదుగుదల కోసం కాంగ్రెసు పార్టీని విమర్శిస్తే మాత్రం సహించేదే లేదన్నారు. తమ పార్టీని విమర్శిస్తే తాము కూడా ధీటుగానే స్పందిస్తామని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. వైయస్ 2003లో పాదయాత్ర చేసినప్పుడు తాను కూడా ఆయనతో పాటు కొద్ది దూరం నడిచానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు యాత్రను ప్రజలు నమ్మరన్నారు.
ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదని, ఇప్పుడు కొత్తగా హామీలు ఇస్తే ప్రజలు ఎలా నమ్ముతారన్నారు. ఆయన గతంలో కూడా పలు హామీలు చేశారని చెప్పారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యక్రమానికి తెలంగాణ మీడియాను అనుమతించక పోవడాన్ని లగడపాటి తప్పు పట్టారు. ఇది సరికాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కూడా దీనిపై నివేదిక తెప్పించుకుంటున్నారని ఆయన చెప్పారు. మీడియాపై వివక్ష తగదన్నారు.
తెలంగాణపై ఏకాభిప్రాయం లేదని కేంద్రమంత్రి వాయలార్ రవి చెప్పారని అన్నారు. ఇంకా తెలంగాణ నేతలకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. ఏకాభిప్రాయం కుదరలేదంటే తెలంగాణ రాదనే విషయం ఇంకా అర్థం కాకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణపై తన అభిప్రాయం ఎప్పటికీ మారదని చెప్పారు.












Click it and Unblock the Notifications