షర్మిల వైయస్‌ను తలపించి జగన్ ఆశల్ని నెరవేరుస్తారా

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పేరుతో 3000 కిలోమీటర్ల పాదయాత్రను గురువారం ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభ సమయంలో షర్మిల మాట్లాడుతూ.. తాను వైయస్ కూతురుని అని, జగన్ సోదరిని అని పరిచయం చేసుకున్నారు. జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పారు. నాన్న ఆశీర్వాదంతో కాంగ్రెసు, టిడిపిని ఎండగడతానని చెప్పారు.

షర్మిల జగన్ ఆశల్ని నెరవేరుస్తారా

షర్మిల జగన్ ఆశల్ని నెరవేరుస్తారా

తల్లి చాటు బిడ్డగా పెరిగిన షర్మిల మీద జగన్ జైలుకు వెళ్లడంతో పార్టీని నడిపించాల్సిన బాధ్యత పడింది. జగన్ జైలులో ఉండటం, విజయమ్మకు రాజకీయాలు తెలియని కారణంగా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసును గట్టెక్కించాల్సిన బాధ్యత షర్మిల ఒక్కరి పైనే ఉంది. జగన్‌కు మరో ఐదారు నెలలు బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పార్టీలో నిస్తేజం ఏర్పడకుండా ఉండేందుకు ఆమె ఈ పాదయాత్రకు సిద్ధమయ్యారు.

తండ్రి హావభావాలు

తండ్రి హావభావాలు

షర్మిల తన తండ్రి హావభావాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత షర్మిల తన తల్లితో కలిసి ఉప ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె మాటలో, చేతలో అంతా తండ్రిని తలపించారు. విజయమ్మ ప్రచారం కంటే షర్మిల ప్రచారమే అందర్నీ ఆకర్షించింది. కాంగ్రెసు, టిడిపిలపై షర్మిల ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకు పడ్డారు. ఎన్నికల ప్రచారం సమయంలో షర్మిల ప్రధానాకర్షణగా నిలిచారు.

జగన్‌ను గట్టెక్కిస్తారా

జగన్‌ను గట్టెక్కిస్తారా


షర్మిల తన పాదయాత్రతో జగన్‌ను గట్టిక్కించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలు మరెంతో దూరం లేనందున జగన్ తన పాదయాత్రతో ఖచ్చితంగా పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకు వస్తారని, ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తారని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. కేవలం పాదయాత్రకే పరిమితం కాకుండా వీలు చిక్కినప్పుడల్లా పార్టీ వ్యవహారాల పైన కూడా ఆమె దృష్టి సారించనుంది. పాదయాత్రతో ప్రజల్లోకి పార్టీని తీసుకు వెళ్లడంతో పాటు జగన్ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేందుకు పార్టీని ఓ గాటాన పెట్టనున్నారు.

పార్టీలో కొత్త ఉత్సాహం

పార్టీలో కొత్త ఉత్సాహం


బాబు పాదయాత్ర ప్రారంభించిన సమయంలో జగన్ పార్టీలో పాదయాత్ర గురించిన చర్చ తీవ్రంగా జరిగినట్లుగా సమాచారం. తమ పార్టీ సైలెంట్‌గా ఉండి బాబా యాత్ర చేస్తే పార్టీ దెబ్బతింటుందని భావించారట. అయితే షర్మిల పాదయాత్ర గురించి ప్రకటన రాగానే ఆ పార్టీలో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లుగా కనిపించిందని చెబుతున్నారు. గత పది రోజులకు ఇప్పటికే పార్టీ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని చెబుతున్నారు.

షర్మిల పాదయాత్రతో ఇప్పుడు రాష్ట్రంలో కొత్త చర్చ ప్రారంభమైంది. షర్మిల దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని మరిపిస్తారా? తన సోదరుడు వైయస్ జగన్ ఆశయాలను నెరవేర్చి ఆయనను గట్టెక్కిస్తారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రను చూసి కాపీ కొడుతున్నారనే విమర్శల నుండి తప్పించుకునేందుకు జగన్ ఎప్పుడో ఈ పాదయాత్రకు సిద్ధమయ్యారని ఆ పార్టీ చెబుతోంది.

స్తబ్దు తొలగించేందుకే షర్మిల పాదయాత్ర

తల్లి చాటు బిడ్డగా పెరిగిన షర్మిల మీద జగన్ జైలుకు వెళ్లడంతో పార్టీని నడిపించాల్సిన బాధ్యత పడింది. జగన్ జైలులో ఉండటం, విజయమ్మకు రాజకీయాలు తెలియని కారణంగా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసును గట్టెక్కించాల్సిన బాధ్యత షర్మిల ఒక్కరి పైనే ఉంది. జగన్‌కు మరో ఐదారు నెలలు బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పార్టీలో నిస్తేజం ఏర్పడకుండా ఉండేందుకు ఆమె ఈ పాదయాత్రకు సిద్ధమయ్యారు.

చంద్రబాబు టిడిపిని మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వస్తున్నా మీకోసం చేపట్టారు. కాంగ్రెసు కూడా పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వం పరంగా, పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతోంది. అయితే జగన్ బయట ఉన్నప్పుడు కాంగ్రెసు, టిడిపిలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఆయన జైలుకు వెళ్లాక ఆ పార్టీలు పుంజుకోవడమే కాకుండా వైయస్సార్ కాంగ్రెసులో స్తబ్దు కనిపించింది. కార్యకర్తల్లో, నేతల్లో స్తబ్దును తొలగించేందుకే షర్మిల ప్రధానంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న ఇలాంటి సమయంలో పార్టీలో నిస్తేజం పనికి రాదని జగన్ చెప్పడంతో ఆమె ఈ సాహస యాత్రకు పూనుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+