రూ.1 నుండి రూ.2కు పెరిగిన పొన్నాల జీతం!

నాటి తన ఉద్యోగ విషయాలను విలేకరులతో పంచుకున్నారు. నాడు తమ గ్రామంలో ఇరవై ఐదు మంది యవకులు కలసి దిన పత్రికలను తెప్పించుకొని సొంతంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. దాని బాధ్యతలను తనకు అప్పగించారని, రోజూ పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత లైబ్రరీని తానే నిర్వహించేవాడినని చెప్పారు.
నెలకు రూపాయి జీతం ఇచ్చే వారని, రెండు నెలలు బాగా చేసే సరికి.. తన జీతాన్ని రెండు రూపాయలకు పెంచారని పొన్నాల తెలిపారు. ఇది 1954వ సంవత్సరంలో తన స్వగ్రామంలో పొన్నాల లక్ష్మయ్య గ్రంథ పాలకుడు (లైబ్రేరియన్)గా ఉద్యోగం చేసినప్పటి జ్ఞాపకం.












Click it and Unblock the Notifications