కన్నడ టివి నటి హేమశ్రీ కేసు: కారు డ్రైవర్ అరెస్ట్

బుధవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో అతడిని ఆంధ్ర సరిహద్దుల్లోని బాగేపల్లె వద్ద ఒక హోటల్లో హెబ్బాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా హేమశ్రీ పైన ఎలాంటి అత్యాచారం జరగలేదని పోలీసులు బుధవారం తెలిపిన విషయం తెలిసిందే. మోతాదుకు మించి క్లోరోఫాం ప్రయోగించడం వల్లనే ఆమె మృతి చెందినట్లుగా కమిషనర్ జ్యోతి ప్రకాశ్ మిర్జి చెప్పారు. తన భర్త సురేంద్ర కుమార్‌తో హేమశ్రీ ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారని చెప్పారు. హైదరాబాదు నుండి బెంగళూరుకు వస్తున్న సమయంలో అనంతపురం సరిహద్దుల్లో హేమశ్రీ మృతి చెందిందన్నారు.
కాగా నటి హేమశ్రీ(30) అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. గత మంగళవారం రాత్రి పది గంటల సమయంలో తీవ్ర అస్వస్థతగా ఉందంటూ ఆమె తన భర్త ముప్పయ్యేడేళ్ల సుధీంద్ర, ఆమెను కారులో బెంగళూరు నగర శివారులోని బాప్టిస్టు ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అప్పటికే ఆమె మరణించినట్లుగా బాప్టిస్టు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే సురేంద్రను అదుపులోకి తీసుకున్నారు.
హేమశ్రీ మృతికి సంబంధించి ఆమె మిత్రుడు మంజునాథ్‌ను కూడా పోలీసులు ప్రశ్నించారు. హేమశ్రీ హత్యకు ముందు అతను ఆమెతో మాట్లాడిన సిడీని విడుదల చేశాడు. తన భర్త సురేంద్ర నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని హేమశ్రీ చెబుతున్నట్లు ఉన్న సీడిని అతను మీడియాకు విడుదల చేశాడు. ఈ నేపథ్యంలోనే మంజునాథ్‌ను పోలీసులు విచారించి, పంపించి వేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు అతనికి చెప్పారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్












Click it and Unblock the Notifications