హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్దపిల్ల, నడిపిపిల్ల, చిన్నపిల్ల: తులసి రెడ్డి కొత్త కామెంట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tulasi Reddy
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ నేత, ఏడు సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్ ఎన్.తులసీ రెడ్డి శుక్రవారం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై కొత్త కామెంట్ చేశారు. టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తన వస్తున్నా మీకోసం పాదయాత్రలో కాంగ్రెసును పెద్ద కాంగ్రెసు, జగన్ పార్టీని పిల్ల కాంగ్రెసు అని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. దానికి కౌంటర్‌గా తులసి రెడ్డి కొత్త కామెంట్ చేశారు.

టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, టిఆర్ఎస్‌లను నడుపుతున్న అధినేతలంతా ఒకప్పుడు కాంగ్రెసు పార్టీ నేతలేనని చెప్పారు. వారంతా తమ పార్టీ నుండే వెళ్లారని చెబుతూ టిడిపి పెద్ద పిల్ల, జగన్ పార్టీ నడిపి పిల్ల, టిఆర్ఎస్ చిన్న పిల్ల అని కామెంట్ చేశారు. కాంగ్రెసు పార్టీని ఎవరు వీడినా ఇబ్బంది లేదన్నారు. తమ పార్టీ ఓ మహా సముద్రమన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష అధ్యక్షులంతా కాంగ్రెసు నేతలుగా పని చేసిన వారేనని, ఇంకా ఎందరు వెళ్లినా వచ్చే నష్టమేమీ లేదన్నారు.

అదిలాబాద్ జిల్లాలో తనకు నియోజకవర్గం లేకనే ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెసు పార్టీని వీడుతున్నారని ప్రభుత్వ విప్ అనీల్ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పండుగకు ముందు దసరా బుల్లోడు తరహా వేషం వేసి ప్రజలను ఆకట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిర బాట కార్యక్రమానికి వస్తున్న ఆదరణ చూడలేకే బాబు, షర్మిలలు పాదయాత్రను ప్రారంభించారన్నారు.

షర్మిల ఆ పార్టీలో ఏ హోదాతో పాదయాత్ర చేస్తుందో ప్రజలకు చెప్పాలని ప్రభుత్వ చీప్ విఫ్ గండ్ర వెంకటరణమా రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెసుకు తెలంగాణపై స్పష్టత లేదన్న ఇంద్రకరణ్ రెడ్డి ఆయన చేరుతున్న పార్టీలో ఆ స్పష్టత ఉందా చెప్పాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, షర్మిలల పాదయాత్రకు ఎంత ఖర్చు పెడుతున్నారో హోంశాఖ బయటపెట్టాలని పాలడుగు వెంకట్రావు డిమాండ్ చేశారు. వారి పాదయాత్రకు భద్రతను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

English summary
Congress party senior leader Tulasi Reddy said on Friday that TDP is big kid, YSR Congress is middle kid and TRS is small kid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X