బాబు ముఖ్యమంత్రి అవుతారన్న మూడోక్లాస్ బుడతడు

ఈడిగ గోపాల్ అనే మూడో తరగతి విద్యార్థికి చంద్రబాబు అంటే తన తల్లిదండ్రుల నుండి ప్రత్యేక అభిమానం ఏర్పడింది. బాబు ఎమ్మిగనూరు వస్తున్నారని తెలుసుకొని, పుస్తకం కొనుక్కోవాలంటూ తండ్రి దగ్గర మూడు రూపాయలు తీసుకున్నాడు. ఆటో ఎక్కి వచ్చేశాడు.
ఎమ్మిగనూరు సరిహద్దు కోటేకల్ వద్ద బాబును చూడగానే పరుగున వెళ్లి నమస్తే సార్ అంటూ కరచాలనం చేశాడు. సార్ మీరు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాంతో నీకు ఓటు హక్కు ఉండి ఉంటే నన్ను ఇప్పుడే ముఖ్యమంత్రిని చేసేలా ఉన్నావని బాబు చమత్కరించి, ఆతనిని దగ్గరకు తీసుకున్నాడు.
కాగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు యాత్రలో ఆయన వెంటే ఓ బుడతడు కనిపించిన విషయం తెలిసిందే. అతడి పేరు అరవింద్. రెండో తరగతి చదువుతున్నాడు. వయస్సు పదేళ్ల లోపు. కానీ, ఆరు రోజులుగా బాబు వెంట పాదయాత్రలో పాల్గొంటున్నాడు.ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన ఈ బుడతడు పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చంద్రబాబు సిఎం కావాల్నదే తన ఆకాంక్ష అని ఆ పిల్లాడు చెప్పడం అందర్నీ ఆకట్టుకుంటుంది.












Click it and Unblock the Notifications