షర్మిల వ్యాఖ్యలకు బొత్స కౌంటర్, భూమన కితాబు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బొత్స అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీని ఎత్తేస్తారని ఆయన అన్నారు. తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారో అందరికీ తెలుసునని అన్నారు. చంద్రబాబు తన పాలనలో ఏ వర్గాలకు న్యాయం చేశారో అందరికీ తెలుసునని, దానిపై కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, సామాన్యులకు అందుతున్న మేళ్లు ఆగిపోతాయని ఆయన అన్నారు.
షర్మిల పాదయాత్రకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుపతి శానససభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి కితాబు ఇచ్చారు. షర్మిల పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫాను సృష్టిస్తోందని ఆయన శనివారం తిరుపతిలో అన్నారు. షర్మిలకు ప్రజలు నిరాజనాలు పలుకుతున్నారని అన్నారు.
తాను 2003లో వైయస్ రాజశేఖర రెడ్డి వెంట పాదయాత్రలో పాల్గొన్నానని, అప్పటికన్నా ఇప్పుడు రెట్టింపు స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. ప్రజల కష్టాలను షర్మిల స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు, షర్మిల పాదయాత్రకు మధ్య పొంతనే లేదని అన్నారు. చంద్రబాబు అధికార దాహంతోనే పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications