యాత్ర: చంద్రబాబును పూలపై నడిపించిన అభిమాని

రానున్న రోజుల్లో చరిత్ర తిరగ రాస్తానని చంద్రబాబు తన పాదయాత్ర సందర్భంగా అన్నారు. వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనపలు చోట్ల ప్రసంగించారు. గతంలో తొమ్మిది సంవత్సరాలు పాలించిన తాను కొన్ని పొరపాట్లు చేశానని అంగీకరించారు.. వాటిని సరిదిద్దుకున్నానన్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక రైతులు, పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకుల అవినీతికి రాష్ట్రం అతలాకుతలమైందని విమర్శించారు. అవినీతి, అరాచకాలకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తెరతీశారన్నారు. వైయస్వారసుడిగా వైఎస్ జగన్ వాటిని తార స్థాయికి తీసుకెళ్లారన్నారు. రాజకీయ వారసులమంటూ కాంగ్రెస్ నాయకులు అదే బాటలో నడుస్తున్నారన్నారు.
కాంగ్రెసు నాయకులకు స్వార్థం, స్వప్రయోజనాలు మినహా ఇతర వ్యాపకాలేవీ లేవన్నారు. అసలు ప్రజల సంక్షేమం పట్టనట్లు వ్యవహరిస్తున్న పాలకులకు ఓటర్లు తగిన గుణపాఠం నేర్పాలని ఆయన పిలుపునిచ్చారు. తన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణకు అవకాశం లేకుండా ప్రజల కోసం పాలకులు, అధికారులు పని చేసేలా చర్యలు తీసుకున్నానని తెలిపారు.
పాదయాత్రలో చంద్రబాబుకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలుష్యం కారణంగా వచ్చిన జలుబు కొనసాగుతుండగా కాళ్ల నొప్పులు మరింత తీవ్రమయ్యాయని టిడిపి నేతలు చెబుతున్నారు. ఎమ్మిగనూరు పట్టణ శివార్లలో బస చేసిన చంద్రబాబు నాయుడును హైదరాబాదు నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం పరీక్షించి వైద్య సేవలు అందజేశారు.












Click it and Unblock the Notifications