పవన్ కళ్యాణ్‌కు చెడ్డ పేరు వస్తుంది: తమ్మారెడ్డి

Pawan Kalyan
హైదరాబాద్: అభిమానులు తీసుకునే నిర్ణయాల వల్ల హీరో పవన్ కళ్యాణ్‌కు చెడ్డ పేరు వస్తుందని ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. దర్శకుడు ఎన్. శంకర్‌ను పవన్ కళ్యాణ్ అభిమానులు బెదిరిస్తున్నారనే వార్తలపై ఆయన సోమవారం ఆ విధంగా అన్నారు. శంకర్‌ను చంపేస్తామని బెదిరించడం తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు.

సున్నితమైన అంశాలపై చిత్రాలు తీసేటప్పుడు దర్శక, నిర్మాతలు లోతుగా ఆలోచించాలని ఆయన సూచించారు. కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, నైజాం పంపిణీదారు దిల్ రాజు కార్యాలయాలపై దాడులు చేయడం సమంజసం కాదని అన్నారు. సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన కెమెరామేన్ గంగతో రాంబాబు చిత్రం వివాదంపై మాట్లాడారు.

కెమెరామేన్ గంగతో రాంబాబు చిత్రం వివాదానికి చిత్ర నిర్మాత దానయ్య తెర దించారు. తెలంగాణ నాయకులు, ప్రభుత్వ కమిటీ సూచనల మేరకు అభ్యంతరకర సన్నివేశాలను, సంభాషణలను పూర్తిగా తొలగించినట్లు ఆయన సోమవారం చెప్పారు.

ఈ రోజు నుంచి వివాదాంసాలు లేకుండానే అన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయాలనే ఉద్దేశంతో సినిమాను నిర్మించలేదని, సదుద్దేశంతోనే కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాను పూరీ జగన్నాథ్ అందించారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+