అమెరికాలో ఆంధ్ర మహిళ హత్య: పాప కిడ్నాప్

చివరకు, ఆమెను దుండగులు కాల్చి చంపి మనవరాలిని ఎత్తుకుపోయారు. చికాగోలో ఉంటున్న తన కుమారుడు హరిప్రసాద్ రెడ్డి వద్దకు సత్యవతి ఇటీవలే వెళ్లింది. కుమారుడు, కోడలు కార్యాలయానికి వెళ్లిన సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఘాతుకానికి పాల్పడ్డారు. సత్యవతి ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కుడుములకుంట్ల గ్రామానికి చెందిన మహిళ.
సత్యవతి మరణంతో ఆమె భర్త కొండారెడ్డి కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొని ఉంది. కొండారెడ్డిని పరామర్శించడానికి బంధువులు, స్నేహితులు వస్తున్నారు. చికాగోలోని ఇంటికి వచ్చిన హరిప్రసాద్ రెడ్డి ఘాతుకాన్ని చూసి, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాపను ఎత్తుకెళ్లిన దుండగులను త్వరలోనే గుర్తిస్తామని చెబుతున్నారు.
దుండగులు పాపను ఎందుకు అపహరించారనే విషయం తెలియడం లేదు. దొంగతనం కోసమే వచ్చారా, మరేదైనా కారణం ఉందా అనేది కూడా తెలియడం లేదు. వివరాలు ఇంకా అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications