హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి పూరీ జగన్నాథ్, అనకాపల్లి నుంచి పోటీ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Puri Jagannath
హైదరాబాద్: కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది. ఆ వార్తాకథనంపై పూరీ జగన్నాథ్ మాట్లాడడం లేదు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని పూరీ జగన్నాథ్ విపరీతంగా అభిమానిస్తారని, అందుకే వైయస్‌ను ప్రతిబింబించే విధంగా తన సినిమాలో ధోవతి ధరించే ముఖ్యమంత్రిని చూపించారని అంటున్నారు.

కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాకు సంబంధించి తాను చూపించిన విషయాల నుంచి వెనక్కి తగ్గడానికి కూడా ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు. అందుకే తన కార్యాలయంలో ఈ నెల 22వ తేదీన ఏర్పాటైన మీడియా సమావేశానికి పంపిణీదారు దిల్ రాజు, నిర్మాత దానయ్య మాత్రమే హాజరయ్యారని, పూరీ హాజరు కాలేదని అంటున్నారు.

వైయస్ జగన్ సోదరుడు గణేష్ ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఉప ఎన్నికల సమయంలో ప్రచారం సాగించిన జగన్ తల్లి వైయస్ విజయమ్మ, సోదరి షర్మిల నర్సీపట్నం సమీపంలో గల గ్రామంలోని పూరీ జగన్నాథ్ ఇంట్లో బస చేశారు. దీనిపై అప్పట్లో సంతోషం వ్యక్తం చేస్తూ పూరీ జగన్నాథ్ ట్వీట్ చేశారు కూడా. పూరీ జగన్నాథ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున అనకాపల్లి లోకసభ సీటు నుంచి పోటీ చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. పూరీ జగన్నాథ్ స్వస్థలం నర్సీపట్నం అనకాపల్లి లోకసభ నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది.

తెలుగుదేశం పార్టీని వదిలేసిన తర్వాత ఆ ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాలను పూరీ జగన్నాథ్ సోదరుడు గణేష్ చూస్తున్నారు. పూరీ జగన్నాథ్ భార్య లావణ్య గానీ, సోదరుడు గణేష్ గానీ ఓ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి టికెట్ అడిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే పూరీ జగన్నాథ్ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా దృశ్యాలను, సంఘటనలను కల్పించినట్లు చెబుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి జీవితచరిత్రను తెరకెక్కిస్తానని అప్పట్లో పూరీ జగన్నాథ్ అప్పట్లో ప్రకటించారు. అయితే, అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే, కీలకమైన సమయంలో, అంటే ఎన్నికలకు ముందు 2013లో ఆ సినిమాను తెరకెక్కించడానికి ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. మహేష్ బాబును గానీ జూనియర్ ఎన్టీఆర్‌ను గానీ పెట్టి ఆ సినిమా తీయాలని పూరీ జగన్నాథ్ అనుకుంటున్నట్లు ఆంగ్ల దినపత్రిక రాసింది.

English summary
According to news reports - It is no secret that Puri Jagan's brother is active member of YS Jagan's party and YS Jagan's mother Vijayamma and sister Sharmila stayed at Puri Jagan's residence at his native village near Narsipatnam during their Odarpu Yatra some months ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X