జగన్‌కు చిక్కు: లెక్కతప్పిన అఫిడవిట్, కేసుకు రంగం?

అక్రమాస్తుల కేసులో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో ఉన్న ఆస్తుల చిట్టాకు ఎన్నికల అఫిడవిట్‌లో సమాచారానికి కూడా తేడా ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణతో సోమవారం సిబిఐ కార్యాలయంలో ఐటి కమిషనర్ భేటీ అయిన విషయం తెలిసిందే. సిబిఐ దగ్గరున్న రికార్డులను ఐటి అధికారులు తమ ఆడిట్ నిపుణులతో క్షుణ్నంగా పరిశీలన చేయించారట.
కొన్ని బ్యాంకు అకౌంట్లను ఐటి రిటర్న్స్‌లో జగన్ చూపలేదని తేలిందని సమాచారం. దీంతో సిబిఐ అధికారుల నుంచి రికార్డులు తీసుకొని ఆయా ఖాతాల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాల కోసం సంబంధిత బ్యాంకులకు ఐటి శాఖ లేఖలు రాయనున్నట్లు సమాచారం. అలాగే ఇన్‌కంటాక్స్ అధికారుల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించిన సిబిఐ నిపుణులు వాటిలో కొన్ని ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.
జగన్ బెయిల్ పిటిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టులో వాదనల సందర్భంగా సిబిఐ అధికారులు సమర్పించిన వివరాల ఆధారంగానే ఐటి అధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఆర్థిక అవకతవకలకు సంబంధించి తాజాగా బలమైన ఆధారాలు లభించడంతో ఇక జగన్‌పై కేసు నమోదు చేసి దూకుడుగా వ్యవహరించేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications