జైలునుండే జగన్ పాలిటిక్స్: యనమల, షర్మిలకు ప్రశ్న

ఆస్తుల కేసులో నిందితుడైన జగన్ నిబంధనలకు విరుద్దంగా జైలులో అన్ని సౌకర్యాలు అనుభవిస్తున్నారని, విచ్చలవిడిగా సెల్ ఫోన్ సౌకర్యం కల్పించారని, ఎవరికీ లేని సౌకర్యాలు కల్పిస్తున్నారని, జైలులో రాజకీయ భేటీలకు అవకాశం కల్పిస్తున్నారని యనమల అన్నారు. వీటిపై తాము లేఖ రాసినట్లు చెప్పారు. జగన్‌ను ఎవరెవరు కలుస్తున్నారో ఎందుకు రికార్డు చేయడం లేదన్నారు. సిసి కెమెరాలు ఉన్నప్పటికీ వాటిని రికార్డ్ చేసినట్లుగా కనిపించడం లేదన్నారు.
వీడియో ఫుటేజ్‌లు ఉంటే వెంటనే వాటిని మీడియాకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్‌కు జైలులో అన్ని సౌకర్యాలు కల్పించే అంశంపై అవసరమైతే తాము న్యాయపరంగా కూడా ముందుకు వెళ్తామన్నారు. జగన్‌ను జైలులో ఎవరెవరు కలుస్తాన్నారో వివరాలు మీడియాకు ఇవ్వాలన్నారు. తాను డిజిపికి లేఖ రాసి మూడు రోజులు గడిచినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదని యనమల చెప్పారు.
సమస్యలు పరిష్కారం కాలేదని పులివెందులలో జగన్ సోదరి షర్మిల చెప్పడంపై యనమల కౌంటర్ ఇచ్చారు. పులివెందుల అభివృద్ధి కాలేదని వైయస్ షర్మిల చెప్పారని, అలాగే ప్రజలు కూడా చెబుతున్నారని, మరి ఎందుకు ఇంకా అభివృద్ధికి నోచుకోలేదో వైయస్ కుటుంబమే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పులివెందులను 35 ఏళ్లుగా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబమే ఏలుతుందని, సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా వారి పైనే ఉందన్నారు.
వైయస్ కుటుంబం ఇన్నేళ్లుగా పులివెందుల సమస్యలను పరిష్కరించనందుకు సమాధానం చెప్పాలన్నారు. ఇంతకాలం పులివెందులను ఏలుతూ అభివృద్ధి చేయని వైయస్ కుటుంబం ఇక రాష్ట్ర సమస్యలను ఎలా పరిష్కరిస్తారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కు అయింది జగన్ పార్టీయే అన్నారు. తన పైనున్న కేసులు ఎత్తివేయించుకోవడానికి జగన్ కేంద్రంతోనూ రాజీ పడ్డారని ఆరోపించారు.
పాలనా అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలను తీరుస్తుందన్నారు. చంచల్‌గూడ జైలును జగన్ పార్టీ కార్యాలయంగా మార్చివేసారని పెద్దిరెడ్డి విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెసు పాలకులు అంధకార ప్రదేశ్‌గా మార్చారని మరో నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు.












Click it and Unblock the Notifications