దసరాకు 24 గంటలే: తెలంగాణపై కెసిఆర్‌కి మోత్కుపల్లి

ఆయన చెప్పిన దసరా పండుగకు మరో ఇరవై నాలుగు గంటలే గడువు ఉందని, కేంద్రం తెలంగాణ దసరాలోపు ఇస్తుందా చెప్పాలని ప్రశ్నించారు. కెసిఆర్ సెంటిమెంటును ఉపయోగించుకొని తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారన్నారు. కెసిఆర్ ఢిల్లీలో నెల రోజులు ఉండి ఏం చేశారన్నారు. కాంగ్రెసు పెద్దలతో జరిపిన మంతనాలను ఆయన వెంటనే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యమం పేరుతో కెసిఆర్ మోసం చేస్తున్నారని, తెలంగాణ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.
కాంగ్రెసు పార్టీతో టిఆర్ఎస్ కుమ్మక్కయిందని ఆరోపించారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే కెసిఆర్ ఆరాటమన్నారు. ఆయనకు తెలంగాణ రావాలని లేదన్నారు. తెలంగాణకు మోసం చేస్తున్న కాంగ్రెసు పార్టీని వదిలి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి నేతలు తమ పార్టీని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. తెలంగాణపై నాన్చుతున్న కాంగ్రెసును ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు.












Click it and Unblock the Notifications