హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు యాత్ర: 6 కొత్త పాటలు, పాల్గొననున్న ఎన్నారైలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర కోసం మరో ఆరు కొత్త పాటలను రూపొందించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే విడుదలైన ఆరు పాటలు అలరిస్తున్నాయి. దీంతో మరో ఆరు పాటలను కొత్తగా రూపొందించారు. పార్టీ నేత రావులపాటి సీతారామారావు ఈ సిడిని సోమవారం విడుదల చేశారు. ఈ పాటలు కూడా ప్రజలను బాగా ఆకట్టుకుంటాయని చెప్పారు.

'ఎల్లమ్మ.. మల్లమ్మ.. లచ్చమ్మ పోదాం పదవే వస్తుండు. వస్తుండు... చంద్రన్న', 'పొలాలనన్ని హలాలనన్ని.. ఇలాతలంలో హేమం పిండగా..', 'ఎల్లన్న.. ఓ మల్లన్న.. మన ఊరికొచ్చాడు చంద్రన్న', 'చితికిన బతుకుల చీకట్లలో చిరు దీపాలు వెలిగించగా..బక్కచిక్కిన బడుగు జీవులకు...', 'రామన్న రాజ్యం తెద్దామంటూ', 'తెలుగువారి ఆత్మగౌరవం'.. అంటూ సాగే ఆరు పాటలను రూపొందించి, సోమవారం విడుదల చేశారు.

యాత్రలో ఎన్నారైలు

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఎన్నారైలు పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో బాబు యాత్ర 12 రోజులు కొనసాగనుంది. దీంతో యుకె, యూరప్ దేశాలలో ఉంటున్న పలువురు ఎన్నారైలు లండన్ నుండి రాష్ట్రానికి వస్తున్నారు. వారు సోమవారం లండన్‌లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద బాబు యాత్రకు సంఘీభావం తెలిపారు. వీరు గురువారం నుండి 30 రోజులపాటు పాదయాత్రలో పాల్గొననున్నారు.

English summary
Telugudesam Party released other six Chandrababu Naidu's Vastunna Meekosam padayatra songs on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X