వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాకు చెప్పా: షర్మిల, బాబు విమర్శలపై విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumanth Rao
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలలు తమ పాదయాత్రలలో కాంగ్రెసు పార్టీపై చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేక పోతున్నామని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పినట్లుగా మంగళవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.

ఆయన ఉదయం సోనియాను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వస్తున్నా మీకోసం పేరుతో చంద్రబాబు, మరో ప్రజా ప్రస్థానం పేరుతో షర్మిలలు పాదయాత్ర చేస్తున్నారని, వారి విమర్శలను తాము తిప్పి కొట్టలేక పోతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. సమర్థవంతంగా తిప్పికొడితేనే కాంగ్రెసు పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నారు. పార్టీలో కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు దక్కేలా చూడమని తాను సోనియాను కోరానని చెప్పారు.

తెలంగాణపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే 16 పార్లమెంటు స్థానాలను తప్పకుండా గెలుస్తామని తాను చెప్పానని తెలిపారు. షర్మిల, చంద్రబాబుల పాదయాత్రలు అధికారం కోసమేనని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.

కుర్చీ కోసం యాత్రే

చంద్రబాబు నాయుడు, షర్మిలల పాదయాత్రలు కుర్చీ కోసమేనని ఏఐసిసి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. కేంద్రం తెలంగాణ ప్రకటించిన తర్వాత 2010 డిసెంబర్ 10వ తేదిన ప్రత్యేక రాష్ట్రంపై యు టర్న్ తీసుకున్నది చంద్రబాబేనని విమర్శించారు. తెలంగాణను చంద్రబాబు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. తమకు ఏ పార్టీతోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదన్నారు.

English summary
Congress party senior leader and MP V Hanumantha Rao has met AICC president Sonia Gandhi on Tuesday informed about the padayatras takenup by Telugudesam president N Chandrababu Naidu and Sharmila
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X