తెలంగాణకు వ్యతిరేకం కాదు: బాబు, టిఆర్ఎస్‌పై ఫైర్

ఈ సందర్భంగా ఆయన అక్కడ సభలో మాట్లాడారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని, తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేయమని కేంద్రానికి లేఖ ఇటీవల రాశామని, అఖిలపక్షం ఏర్పాటు చేస్తే తమ అభిప్రాయం చెబుతామన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆడుతుంటే తెలంగాణ రాష్ట్ర సమితి కేవలం తమ పార్టీనే లక్ష్యంగా చేసుకుందని ధ్వజమెత్తారు.
తెలంగాణ వస్తోందని చెబుతూ టిఆర్ఎస్ కాంగ్రెసులో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉందన్నారు. పిల్ల కాంగ్రెసు పార్టీ కూడా కేసులు ఎత్తివేస్తే విలీనమవుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. మాదిగల రుణం తీర్చుకుంటానని చెప్పారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెస్సేనని, అందరం కలిసి ఆ పార్టీపై ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణలో టిడిపి ప్రభుత్వమే ఎక్కువ అభివృద్ధి చేసిందని స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమేనా అని కాంగ్రెస్‌కు సవాల్ విసిరినా స్పందించలేదని విమర్శించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పటేల్, పట్వారీ వ్యవస్థను రూపుమాపారన్నారు. తెలంగాణ ఇచ్చే శక్తి టిడిపికి లేదని, దీనికి సంబంధించి కాంగ్రెస్‌పై ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications