ఉగ్రవాది అజ్మల్ కసబ్ క్షమాభిక్ష పిటిషన్ తోసివేత

Ajmal Kasab
న్యూఢిల్లీ: ముంబై కాల్పుల ఘటనలో ఉరిశిక్ష పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ పెట్టుకుని క్షమాభిక్ష పిటిషన్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం తోసిపుచ్చింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి భవన్‌కు సమాచారం అందించింది. కసబ్ మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని కోరింది. తనకు క్షమాభిక్ష ప్రసాదించి, ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలని కసబ్ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆ నిర్ణయం తీసుకుంది.

కసబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చాలని ఇంతకు ముందు మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోరింది. ఈ పరిణామాన్ని సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికం స్వాగతించారు. హోం మంత్రిత్వ శాఖ సిఫార్సును రాష్ట్రపతి అధ్యయనం చేయాల్సి ఉంటుందని, ఇది మంచి పరిణామమని, ఈ కేసులో ఇది సానుకూల దశ అని ఆయన అన్నారు .

మనం తప్పు చేయకపోవడం సంతోషకరమని, రాష్ట్రపతి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలర్పించిన ఎన్ఎస్‌డి అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ తండ్రి కె. ఉన్నికృష్ణన్ అన్నారు.

కసబ్‌కు ఉరిశిక్ష పడితే ఆ శిక్ష అనుభవించినవారిలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారదేశంలో కసబ్ 52వ వాడు అవుతాడు. గత నెలలోనే కసబ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయంతో కసబ్‌కు ఉరిశిక్ష తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+