నో కామెంట్: చంద్రబాబు 'తెలంగాణ'పై వాయలార్ రవి

కెసిఆర్‌తో జరిగిన చర్చల్లో తాను పాల్గొనలేదని చెప్పారు. తెలంగాణ ప్రాంత మంత్రులు తమను కలిశారని, తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారన్నారు. నిర్ణయం చెప్పేందుకు తాను కేంద్ర ప్రభుత్వాన్ని కాదని, కేవలం కేంద్రమంత్రిని మాత్రమే అన్నారు. తెలంగాణపై ఇప్పటి వరకైతే ఎలాంటి విషయం లేదన్నారు.
కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం తన వస్తున్నా మీకోసం పాదయాత్ర తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించిన సమయంలో తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని విమర్శించిన విషయం తెలిసిందే.
తాము తెలంగాణపై వెంటనే తేల్చాలని లేఖ రాశామని, అయితే కేంద్రం మాత్రం అఖిలపక్షం నిర్వహించకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. అఖిలపక్షం నిర్వహిస్తే తాము తెలంగాణపై అభిప్రాయం చెబుతామన్నారు. దీనిపై వాయలార్ రవి ఈ రోజు ఢిల్లీలో స్పందించారు.












Click it and Unblock the Notifications