బిజెపికి యడ్డీ గుడ్‌బై!: త్వరలో కర్నాటక జనతా పార్టీ

ఆయన మంగళవారం ఆయుధ పూజలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు బిజెపితో పడటం లేదని, తాను ఏం చెబుతానో అదే చేస్తానని అన్నారు. తాను డిసెంబర్ 10వ తేదీ లోగా తన రాజీనామా పార్టీ అధ్యక్షుడికి పంపించనున్నట్లు చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. కాగా గత కొంతకాలంగా యడ్యూరప్ప బిజెపి అధిష్టానంతో విభేదిస్తున్న విషయం తెలిసిందే.
యడ్యూరప్ప ఏ క్షణంలోనైనా పార్టీకి రాజీనామా చేస్తారని గత కొంతకాలంగా వినిపిస్తోంది. గత ఏడాది స్కాం కేసులో ఇరుక్కొని ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్న యడ్యూరప్ప ఆరు నెలల్లో తిరిగి ముఖ్యమంత్రి అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఆయనకు ఝలక్ ఇచ్చింది. అయితే అతను డిమాండ్ మేరకు అతను సూచించిన వారికే రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది.
అయినప్పటికీ యడ్యూరప్పకు అధిష్టానంపై అసంతృప్తి చల్లారలేదు. అతను రాష్ట్ర బిజెపి అధ్యక్ష పీఠాన్ని కోరుకుంటున్నారు. దానికి పార్టీ సుముఖంగా లేదని, అందుకే ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారని చెబుతున్నారు. డిసెంబర్ 10న యడ్యూరప్ప కొత్త పార్టీ పెట్టడానికి ముందు పార్టీకీ రాజీనామా చేయనున్నారు. యడ్డీ కొత్త పార్టీ పేరు కర్నాటక జనతా పార్టీగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications