కిరణ్‌కు డిప్యూటీ నో రెస్పాన్స్: బొత్స రాజీ యత్నాలు

కిరణ్‌పై ఆగ్రహంతో ఉన్న దామోదర ఈ వ్యవహారంతో సొంత జిల్లాలో నిర్వహించి ఇందిర బాట కార్యక్రమంలో పాల్గొనకూడవద్దని నిర్ణయించుకున్నారు. సొంత జిల్లాలో దామోదర బాటలో పాల్గొనకుంటే విమర్శలు ఎదుర్కోవాల్సి రావడమే కాకుండా, ప్రతిపక్షాలకు అవకాశమిచ్చినట్లు అవుతుందని భావించిన కిరణ్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు వెంటనే రంగంలోకి దిగారు.
దామోదర అసంతృప్తిని పోగొట్టేందుకు ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్ చేశారు. అయితే దామోదర నుండి ఆయనకు రెస్పాన్స్ రానట్లుగా తెలుస్తోంది. కిరణ్ వెంటనే బొత్సను రంగంలోకి దింపారు. బొత్స సచివాలయంలో దామోదరతో భేటీ అయ్యారు. ఆయన ఇందిర బాట కార్యక్రమంలో పాల్గొనే అంశంపై చర్చిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన దామోదరకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దామోదర ఎంత వరకు వారి విజ్ఞప్తిని మన్నిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications