జగన్ ఆస్తుల కేసు: రెండోసారి కోర్టుకు ధర్మాన ప్రసాద్

కాగా ఈ కేసులో గతంలో ఓసారి హాజరు కావాల్సినప్పటికీ ధర్మాన హాజరు కాలేదు. తన తల్లి మరణించడంతో విచారణకు హాజరు కాలేకపోతున్నానని సిబిఐ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన తల్లి గత గురువారం మృతి చెందిందని, కర్మకాండలు ఇంకా ముగియలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మంత్రి అభ్యర్థనను సిబిఐ కోర్టు అంగీకరించింది. దీంతో ధర్మాన ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు.
కాగా నెల రోజుల క్రితం మొదటిసారి ధర్మాన కోర్టుకు హాజరయ్యారు. అప్పుడు జగన్‌ను కూడా కోర్టుకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా జగన్, ధర్మానలు కోర్టు వద్ద షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు జగన్‌కు అరగంట సమయం ఇచ్చారు. తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతివ్వాలని జగన్ పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో కోర్టు అనుమతించింది.












Click it and Unblock the Notifications