కొత్త ట్విస్ట్: సాయికి ఈడి నోటీసు, జగన్‌ను తరలిస్తారా?

కాగా ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని విచారణకు అనుకూలంగా ఉండేందుకు ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలిస్తారనే ఊహాగానాలు చెలరేగిన విషయం తెలిసిందే. విజయ సాయి రెడ్డికి ఢిల్లీ రావాలని నోటీసులు ఈడి నుండి రావడంతో జగన్‌ను కూడా విచారించేందుకు హైదరాబాదు నుండి ఢిల్లీకి తరలిస్తారా అనే ప్రశ్న పలువురులో ఉదయిస్తోంది. ఇప్పటికే పలు ఆస్తులను జప్తు చేసిన ఈడి జగన్‌ను కూడా ఢిల్లీలో విచారించే అవకాశముందని చెబుతున్నారు.
మరోవైపు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, ఎమ్మార్ కేసు, ఓబుళాపురం మైనింగ్ కేసులోని నిందితులను నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. అనంతరం వారికి వచ్చే నెల(నవంబర్) 8వ తేది వరకు జ్యూడిషియల్ రిమాండును పొడిగించింది. జగన్, బ్రహ్మానంద రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులకు రిమాండ్ పొడిగించింది.
తన బెయిల్ పిటిషన్‌కు సంబంధించి షరతులను సడలించాలని విజయ రాఘవ కోర్టును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications