బాబు జై తెలంగాణే, ఏం చేస్తామో చూడండి: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోకుంటే మేం ఏ నిర్ణయం తీసుకుంటామో తెలంగాణవాదులే చూస్తారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తెలంగాణ టిడిపి కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు గురువారం అన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ఎర్రబెల్లి, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేత తదితరులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి మాట్లాడుతుండగా తెలంగాణవాదులు అడ్డుకున్నారు. జై తెలంగాణ గో బ్యాక్ టిడిపి అంటూ నినాదాలు చేశారు. వారిని దత్తాత్రేయ వారించారు. దీంతో ఎర్రబెల్లి తెలంగాణవాదులకు వివరణ ఇచ్చారు. కేంద్రం తెలంగణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే తమ పార్టీ నిర్ణయాన్ని తప్పకుండా వెల్లడిస్తామన్నారు. తెలంగాణకు అనుకూలంగానే పార్టీ అధిష్టాన్ని ఒప్పిస్తామన్నారు. ఒకవేళ అఖిలపక్షంలో చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో మేం ఏం నిర్ణయం తీసుకుంటామో మీరే చూడండన్నారు.

కోదండరామ్ మాట్లాడుతూ... తెలంగాణ ఆపేందుకు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏ రాజకీయ కారణాలు లేవు కాని, తెలంగాణ నేతలు ఏకం కావడానికే ఉన్నాయా అని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి, కాంగ్రెసులు నిర్ణయం తీసుకోకుంటే భవిష్యత్తు లేదన్నారు. వచ్చేసారి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి ఆంద్రా నేతలతో దోస్తీని విడిచి పెట్టిన వారిని పిలవండని సూచించారు.

తెలంగాణ నేతలు ఆంధ్రా ప్రాంత నేతల స్నేహం వదిలి పెట్టాలన్నారు. అందరూ ఐక్యంగా ఉద్యమిస్తే తెలంగాణ తథ్యమన్నారు. తెలంగాణ నేతల్లో మునుపటి ఐక్యత మళ్లీ కనిపిస్తోందని దామోదర్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9వ తేది లోపు కేంద్రం తెలంగణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. తనకు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశ్యం లేదని, అయితే రాజీనామా చేసేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు ముందుకు వస్తే తెలంగాణ రావడం ఖాయమని కె కేశవ రావు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+