హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్‌కు బొత్స చురక: జగన్‌ వైపు ఎమ్మెల్యేలపై పితాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ విషయంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలు పాటించాల్సిందేనని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సూచించారు. శుక్రవారం గాంధీ భవనంలో రాష్ట్ర కాంగ్రెసు కమిటీ భేటీ ఉంది. ఇందుకోసం ఆయన ఏర్పాట్లను పరిశీలించేందుకు గాంధీ భవన్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేపు భేటీ ఉందని, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర, కేంద్ర మంత్రులు అందరూ హాజరవుతారని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహల మధ్య విభేదాలు అన్న అంశాన్ని తాను మీడియాలోనే చూశానని చెప్పారు. తాను ఇరువురితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. భిన్నాభిప్రాయాలు ఉంటాయే కానీ విభేదాలు ఉండవన్నారు.

బాబు యాత్ర ఎందుకో అందరికీ తెలుసు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అందరికీ తెలుసునని మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పథకాల అమలు కోసమే ఇందిర బాట నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని, ఇందిర బాటను ఎవరూ అడ్డుకోవద్దని సునీత లక్ష్మా రెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

జగన్ వైపు వెళ్లేది తెలియదు

చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేష్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపుకు మొగ్గుతున్నట్లుగా తమకు తెలియదని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. పార్టీ నిబంధనలకు ఎవరు పని చేసినా చర్యలు తప్పవన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు పథకాలను చంద్రబాబు రద్దు చేశారని, ప్రజల్లో నమ్మకం పెంచుకునేందుకే ఆయన పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.

English summary
PCC chief Botsa Satyanarayana has suggested CM Kiran Kumar Reddy on Thursday indirectly that all the party leaders must obey Sonia Gandhi orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X