బతుకమ్మ ఆడిన భువనేశ్వరి: బాబుకు షర్మిల ప్రశ్నలు

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బతుకమ్మను ఆడారు. పలువురు కార్యకర్తలు, ప్రజలు బాబుకు జమ్మి పెట్టారు. అంతకుముందు ఉదయం పాదయాత్ర చేసిన బాబు ఆరు కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఇది స్థానికంగా అందర్నీ ఉత్సాహపరిచింది. అంతకుముందు పాదయాత్ర చేసిన చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, టిఆర్ఎస్‌లపై నిప్పులు చెరిగారు.
టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు ఎప్పటికైనా కాంగ్రెసులో కలిసిపోతాయని ఆరోపించారు. కేంద్రం కేసులు ఎత్తివేస్తే తల్లి కాంగ్రెసులో కలిసిపోయేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. తమ పాదయాత్రకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాదయాత్రకు పోలిక లేదన్నారు.
కాగా షర్మిల అనంతపురం జిల్లాలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు. ఆమె 15 కిలోమీటర్లు నడిచారు. ప్రజా సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే ఆయన అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఉన్న కాంగ్రెసు ప్రభుత్వాన్ని టిడిపి కాపాడుతోందన్నారు. పాదయాత్రతో నాటకాలాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజా సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications