రక్తమోడిన దేవరగట్టు: స్వామి కోసం 'బన్నీ' ఫైట్

ఈ దాడిలో సుమారు డెబ్బై మందికి పైగా గాయాలపాలయ్యారు. తలలు పగిలాయి. తీవ్ర గాయాలై తలలు పగిలినప్పటికీ ఇరు గ్రామాల ప్రజలు మళ్లీ బన్నీ ఫైట్‌లో పాలు పంచుకున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ భక్తుల హింసాత్మక ధోరణిని మాత్రం అడ్డుకోలేకపోయారు. దీనిపై పలు సంఘాలు కూడా స్వామి వారి భక్తులలో చైతన్యం తీసుకు వచ్చే కార్యక్రమాలు కొన్నేళ్లుగా చేపడుతున్నారు. కానీ అవి ఫలించడం లేదు.
దేవరగట్టులో ఆరు రోజుల పాటు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. బుధవారం ఆఖరు రోజు. ఈ రోజు స్వామివారిని దక్కించుకునేందుకు ఇరు గ్రామాల ప్రజలు బన్నీ ఫైట్‌కు దిగుతారు. దాదాపు వెయ్యి మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ఫలించలేదు. ఇనుప చువ్వలున్న కర్రలతో భక్తులు ఫైట్ చేశారు. అంతకుముందు పోలీసులు ఇరు గ్రామస్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. గాయపడ్డ వారికి మెడికల్ క్యాంపులో చికిత్స అందించారు. ఈ ఉత్సవంలో పన్నెండు గ్రామాలు పాల్గొన్నాయి.
కాగా దసరా పండుగ నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రీ భక్తులతో కిటకిటలాడుతోంది. రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో దుర్గమ్మను చూసేందుకు భక్తులకు లఘు దర్శనం ఏర్పాటు చేశారు. దేవాలయ కమిటీ భక్తుల కోసం సదుపాయాలు కల్పించింది.












Click it and Unblock the Notifications