చంద్రబాబుకు రక్షణగా ఎమ్మార్పీయస్ కార్యకర్తలు

ఐజాలో పాదయాత్రను ప్రారంభిస్తూ చంద్రబాబు అక్కడి పత్తి మిల్లును పరిశీలించారు, కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాబు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో మొండెద్దు ప్రభుత్వం సాగుతోందని అన్ారు. ఎన్ని ఆందోళనలు చేసినా నిరసనలు చేసినా స్పందించడం లేదని, ప్రజలు సమస్యల సుడిగుండంలో ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.
నిత్యావసర ధరలను పెంచివేశారని అన్నారు. మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక వైపు నీరు లేక పంటలు ఎండిపోయి, మరోవైపు ఎలాగోలా కష్టపడి పండించిన పంటకు సరైన ధరలేక రైతులు విలవిల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమర్థవంతమైన, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. అందుకే మీ కోసమే వచ్చాను... మీ సమస్యలు తెలుసుకుంటున్నానని ఆయన చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అయన అన్నారు.
తాము అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు ఉచిత, నాణ్యమైన విద్యుత్ వ్యవసాయానికి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, ఢీజిల్ ధరలతో పాటు మద్యం ధరలు కూడా పెంచిందని, దొరికినదంతా దోచుకొని రాష్ట్రాన్ని స్మశానంలా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఆధాయం పెరిగినా ప్రజలు మాత్రం అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు.












Click it and Unblock the Notifications