జగన్ జైళ్లో ఎందుకున్నారు: షర్మిలకు మురళీ మోహన్

Murali Mohan
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను తెలుగుదేశం పార్టీ నేత, ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ బుధవారం ప్రశ్నించారు. పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న మురళీ మోహన్ మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు తన సోదరుడు జగన్ అవినీతిపై ప్రశ్న సంధించారు.

షర్మిల తన సోదరుడు వైయస్ జగన్ అంత డబ్బు ఎలా సంపాదించారో తన పాదయాత్రలో ప్రజలకు చెప్పాలన్నారు. జగన్ జైలుకు ఎందుకు వెళ్లాడో కూడా సమాధానం చెప్పాక పాదయాత్ర చేస్తే బాగుంటుందన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న వస్తున్నా మీకోసం పాదయాత్రకు, షర్మిల పాదయాత్రకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. షర్మిల అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నరని, బాబు మాత్రం ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు చేస్తున్నారన్నారు.

కాగా మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు బుధవారం దసరా పర్వదినం సందర్భంగా ఆరు కిలోమీటర్ల మేర నడిచి, ఆ తర్వాత తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి పండుగను జరుపుకున్నారు. అంతకుముందు పాదయాత్ర సమయంలో చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, టిఆర్ఎస్‌లపై నిప్పులు చెరిగారు.

టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు ఎప్పటికైనా కాంగ్రెసులో కలిసిపోతాయని ఆరోపించారు. కేంద్రం కేసులు ఎత్తివేస్తే తల్లి కాంగ్రెసులో కలిసిపోయేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. తమ పాదయాత్రకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పాదయాత్రకు పోలిక లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+