నటి, మోడల్ దారుణ హత్య: దొరకని క్లూ

 Mumbai Police still clueless about actor-model's murder
ముంబై: ముంబైలోని అంధేరిలో గల తన అపార్టుమెంటులో నటి, మోడల్ విదుషి దాస్ బర్దే మూడు రోజుల క్రితం హత్యకు గురైంది. అయినా ఇప్పటి వరకు పోలీసులకు ఏ విధమైన క్లూ లభించలేదు. మృతికి ముందు 23 ఏళ్ల మాజీ బ్యూటీ క్వీన్ విదుషికి 100 మిస్డ్ కాల్స్, 200 టెక్స్ట్ట్ మెసేజ్‌లు వచ్చాయి. ఈ కాల్ రికార్డులు హంతకులను పట్టిస్తాయని పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు బుధవారం విదుషి భర్త కేదార్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అక్టోబర్ 22వ తేదీ రాత్రి తన పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత అతను తన భార్య ఫ్లాట్‌లో మరణించి ఉండడాన్ని చూశాడు. ముందు ప్రమాదవశాత్తు సంభవించిన మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, పోస్టుమార్టం నివేదికలో పదునైన ఆయుధంతో విదుషిని చంపినట్లు తేలడంతో హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

తన భార్య డయాబెటిక్ రోగి అని కేదార్ చెప్పాడు. దీంతో వ్యాధి కారణంగా సంభవించిన ప్రమాదంలో గ్లాస్ షోకాజ్‌పై విదుషి పడి ఉంటుందని, దానివల్ల గాయాలై మరణించి ఉంటుందని పోలీసులు తొలుత భావించారు. గాజు పెంకులు ఆమె మెడ మీద, దవడ మీద, నాలుకపై, గదుమపై కనిపించాయి. తన భార్య తరుచుగా స్పృహ తప్పి పడిపోతూ ఉండేదని కేదార్ చెప్పాడు.

ఫ్లాట్ నుంచి విలువైన వస్తువులేవీ పోలేదు. దీంతో దొంగతనం కోసం జరిగిన హత్య కాదని పోలీసులు అంటున్నారు. బలవంతంగా ఇంట్లోకి ఆగంతకులు చొరపడిన దాఖలాలు కూడా లేవు. విదుషి మరణించిన రోజు కేదార్ తన వద్ద ఉన్న తాళం చెవులతోనే ఇంట్లోకి వెళ్లాడు.

అక్టోబర్ 22వ తేదీ సాయంత్రం విదుషి వద్దకు ఓ వ్యక్తి వచ్చాడని పొరుగువారు చెబుతున్నారు. అదే రోజు ఉదయం మరో వ్యక్తి వచ్చినట్లు కూడా చెబుతున్నారు. భవనం సిసిటివి ఫుటేజ్ సమాచారాన్ని ఇవ్వగలదని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+