కూలిన వేదిక: చంద్రబాబుకు తప్పిన ప్రమాదం

ఘటన అనంతరం చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లారు. చంద్రబాబు ఆ తర్వాత అర కిలోమీటరు నడిచారు. షెడ్యూల్ ప్రకారం రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంది. చంద్రబాబు నడుము భాగం స్వల్పంగా కమిలినట్లు తెలుస్తోంది. అలాగే, కాలికి కూడా కాస్తా గాయమైనట్లు సమాచారం. వెంటనే స్థానిక వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబుకు వైద్యులు సలహా ఇస్తున్నారు.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్ గద్వాలకు హైదరాబాదు నుంచి బయలుదేరారు. డాక్టర్ నరేంద్రనాథ్ ఆధ్వర్యంలోని ఓ ప్రత్యేక బృందం కూడా గద్వాలకు బయలుదేరింది. చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుందని, ఏ విధమైన ఇబ్బంది లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర రెడ్డి చెప్పారు. తనకు ఏమీ కాలేదని, క్షేమంగానే ఉన్నానని చంద్రబాబు చెప్పారు. శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ ఈ సంఘటనలో గాయపడినట్లు తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన అక్టోబర్ 2వ తేదీన అనంతపురం జిల్లాలో తన పాదయాత్రను ప్రారంభించారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన తన పాదయాత్రను ముగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే, పాదయాత్రలో ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications