భారతికి శోభ సవాల్: ఆరోగ్యం జాగ్రత్త.. బాబుకు మంత్రి

జగన్‌కు చెందిన పలు కంపెనీలలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో భారతి చెప్పాలని డిమాండ్ చేశారు. లోటస్ పాండ్, బెంగళూరులో ఆధునాతన భవంతులు ఎలా వచ్చాయో ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ సోదరి షర్మిల ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని నిలువునా దోచారని మండిపడ్డారు.
బాబుకు టిజి వెంకటేష్ లేఖ
కాగా ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించిన సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా గ్రామాలకు మంచి నీళ్లు అందించేందుకు తుంగభద్ర నది నుంచి ఎత్తిపోతల పథకం నిర్మించి సి.బెళగల్ రిజర్వాయరు నింపాలంటూ బాబు లేఖ రాశారు. దీనికి చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ స్పందించారు.
ఈ సమస్యను గ్రామస్తులు తన దృష్టికి తీసుకు వచ్చారని, ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకు వచ్చారని, ఆ ఎత్తిపోతల పథకం కోసం ఇప్పటికే సర్వే చేస్తున్నారని, ఈ పథకాన్ని సీరియస్‌గా తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా లేఖలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చంద్రబాబుకు సూచించారు.












Click it and Unblock the Notifications