ఆలోచిస్తా: బాబును కల్సిన బాలయ్య: త్వరలో ఎన్టీఆర్

బాబు పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి తాను పాదయాత్రలో పాల్గొనడం లేదని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, భావిష్యత్తులో పాల్గొనే విషయంపై త్వరలో చెబుతానన్నారు. పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన ఉందని చెప్పారు. చంద్రబాబు భారీ పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నారని, కాళ్ల నొప్పులు తదితర చిన్న నొప్పులు వచ్చినప్పటికీ యాత్రను సమర్థవంతంగా చేస్తున్నారన్నారు. ప్రజల కోసమే ఆయన యాత్ర అన్నారు.
బాబు పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు పాదయాత్ర విజయవంతం కావాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని బాలకృష్ణ స్థానికంగా ఉన్న శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బావ కోసం ప్రత్యేక పూజ చేసినట్లు చెప్పారు. అనంతరం ఆయన హైదరాబాద్ బయలుదేరారు.
త్వరలో జూనియర్ ఎన్టీఆర్
హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో చంద్రబాబు పాదయాత్రలో పాల్గొననున్నారని సమాచారం. కలిసి వెళ్లడం కాకుండా కాసేపు ఆయన చంద్రబాబుతో పాదయాత్ర చేసే అవకాశముంది.












Click it and Unblock the Notifications