పాతబస్తీలో హుజి టెర్రరిస్ట్ అరెస్ట్: రక్తపాతానికి కుట్ర

ఇతను రాజధానిలో రక్తపాతం సృష్టిచేందకు కుట్ర పన్నినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల అరెస్టయిన సులేమన్ ఇచ్చిన వివరాలతో బెంగళూరు పోలీసులు సయ్యద్ మక్బూల్‌ను అరెస్టు చేశారు. మక్బుల్ గతంలో చాలామంది ఉగ్రవాదులకు ఆశ్రయిం ఇచ్చినట్లుగా గుర్తించారు.
ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్న నేతల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించడం ఇతని పని. ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ నేతలే టార్గెట్ అని తెలస్తోంది. ఒబేద్‌కి సమాచారం ఇవ్వడం, ఈమెయిల్స్ పంపడం చేసేవాడని గుర్తించినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల కర్నాటక పోలీసులు పలువురు టెర్రరిస్టులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
రెండు నెలల క్రితం లష్కరే తోయిబా, కర్ణాటకలోని హుజీతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న 11 మంది అరెస్టు చేశారు. వారి నుండి భద్రాత సిబ్బందికి మరిన్ని విషయాలను తెలిశాయి. వారు హైదరాబాద్, బెంగళూరు, తదితర ప్రాంతాలలో రక్తపాతానికి కుట్ర పన్నినట్లుగా పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications