హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు యువత సంబరాల్లో అగ్నిప్రమాదం: ఆనం సెటైర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Vivekananda Reddy
నెల్లూరు/హైదరాబాద్: కేంద్రమంత్రిగా కాంగ్రెసు ముఖ్యనేత చిరంజీవి ప్రమాణ స్వీకారం చేయడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చిరంజీవి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాల సందర్బంగా జరిగిన ప్రమాదంలో ఆనం వివేకానందకు ముప్పు తప్పింది. ఈ రోజు మధ్యాహ్నం చిరంజీవి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇది తెలియగానే చిరంజీవి యువత ఆనందాలు చేసుకుంది. ఈ కార్యక్రమానికి అనం హాజరయ్యారు.

ఆనం పక్కనే ఒక్కసారిగా పేలుడు వినిపించింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఆనం సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అభిమానులు ఉత్సాహంతో పేల్చిన బాణసంచా అటువైపుకు వచ్చి గ్యాస్ బెలూన్ల పైన పడినట్లుగా గుర్తించారు. దీంతో బెలూన్లు వరుసగా పేలాయి. ఇది అక్కడ కాసేపు అలజడి సృష్టించింది. అయతే దీని పైనా కూడా ఆనం సెటైర్లు వేసి కాసేపు అక్కడున్న వారందరినీ అలరించారు. ప్రతిపక్షాల గుండెల్లో బెలూన్లు పేలాయని ఎద్దేవా చేశారు.

తన బిడ్డ పేదల కోసం ఎప్పుడూ తపిస్తాడని కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సర్వే సత్యనారాయణ తల్లి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సర్వే ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వస్తానంటే తాను ప్రోత్సహించానని చెప్పారు. తన తనయుడికి ఈ పదవిని అప్పగించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తన కొడుకు తమను, తమ కుటుంబ సభ్యులను, ఇతరులను ఎంతో ఆప్యాయంగా చూస్తారని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.

తాను ఢిల్లీ వెళ్లి ప్రమాణ స్వీకారంలో పాల్గొనలేనని, ఇంట్లో కూర్చునే టీవీలో చూస్తానని చెప్పారు. కేంద్ర పదవి వచ్చినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సర్వే తెలంగాణకు అనుకూలంగా ఉండేవారన్నారు. తెలంగాణనే కోరుకుంటారన్నారు. సర్వే తనయుడు యాదగిరి తన సోదరుడికి కేంద్రమంత్రి పదవి వచ్చిన విషయం తెలిసి ఆనందపడ్డారు.

English summary
Small fire accident took place in SPS Nellore district on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X